
వరుసగా మూడు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. 15వ రౌండులో టీఆర్ఎస్ 955 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. మొత్తంగా ఈ రౌండులో టీఆర్ఎస్‌కు 3027 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 2072, కాంగ్రెస్ 1500 ఓట్లు పోలయ్యాయి. 15వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ 2483 ఓట్ల లీడ్‌లో ఉంది.
13వ రౌండులో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 304 ఓట్ల ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ 2824, బీజేపీ 2520, కాంగ్రెస్ 1212 ఓట్లు సాధించాయి. కాగా.. పదమూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 39265, టీఆర్ఎస్‌కు 35539, కాంగ్రెస్‌కు 11874 ఓట్లు పోలయ్యాయి. 13 రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ 3726 ఓట్ల లీడ్‌లో ఉంది.
14వ రౌండులో కూడా టీఆర్ఎస్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఈ రౌండులో టీఆర్ఎస్ 288 ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఈ రౌండులో బీజేపీ 2249, టీఆర్ఎస్ 2537, కాంగ్రెస్ 784 ఓట్లు దక్కించుకున్నాయి.