రాజేంద్రనగర్‭లో వెటర్నరీ క్లీనికల్ కాంప్లెక్స్‭ ప్రారంభించిన టీఆర్ఎస్ మంత్రులు

రాజేంద్రనగర్‭లో వెటర్నరీ క్లీనికల్ కాంప్లెక్స్‭ ప్రారంభించిన టీఆర్ఎస్ మంత్రులు

వెటర్నరీ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూగ జీవాలకు సేవ చేసే భాగ్యం రావడం అదృష్టం అని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి అన్నారు. తల్లి దండ్రులు మీ మీద పెట్టుకున్న ఆకాంక్షలకు అనుగుణంగా వెటర్నరీ విద్యార్థులు రాణించాలని చెప్పారు. రాజేంద్రనగర్‭లోని ప్రధాన కూడలిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన.. వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కావడం శుభ సూచకమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రూ.12 కోట్ల 76 లక్షలతో నూతనంగా ఏర్పాటైన.. న్యూ వెటర్నరీ క్లీనికల్ కాంప్లె్క్స్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సబితా ఇంద్రారెడ్డి  ప్రారంభించారు. 

మానసిక వికలాంగులకు ప్రత్యేక కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికోసం సీఎం అనేక కార్యక్రమలు చేస్తున్నారని ఆమె చెప్పారు. డీసబిలిటీ పర్సన్స్‭కి 3 వేల పెన్షన్.. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పరికరాలు.. వెహికిల్స్ అందచేస్తున్నామని తెలిపారు. వికలాంగుల దినోత్సవం సందర్బంగా మూడు రోజుల పాటు ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ కంపిటిషన్స్ జరుగుతాయని తలసాని అన్నారు. గెలిచిన వారికి డిసెంబర్ 3వ తేదీన రవీంద్ర భారతిలో అవార్డులు అంజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వికాలాంగులకు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, రిజర్వేషన్ కల్పిస్తోందని మంత్రి తలసాని అన్నారు.