అతి తెలివి.. బిర్యానీ అడిగితే పాసన్నం పెట్టింది

అతి తెలివి.. బిర్యానీ అడిగితే పాసన్నం పెట్టింది

పసుపు బోర్డు తెస్తానని నిజామాబాద్ రైతులను ఎంపీ అర్వింద్ మోసం చేశారన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతులు పసుపు బోర్డు కావాలన్నారు కానీ స్పైసెస్ బోర్డు కాదన్నారు. స్పైసెస్ బోర్డ్  కొత్తది కాదని..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఉందన్నారు.  పసుపు బోర్డ్ పై ఫేక్ జీవో ప్రచారం చేయించారన్నారు. బిర్యానీ అడిగితే  పాసన్నం  పెట్టి బీజేపీ అతితెలివి చూపిస్తుందన్నారు. అర్వింద్ కు పసుపు బోర్డుకు, స్పైసెస్ బోర్డుకు తేడా తెలీదన్నారు. పసుపు బోర్డ్ వచ్చే వరకు ఎంపీ అరవింద్ ఢిల్లీ నుంచి రావొద్దన్నారు.  పసుపు బోర్డ్ తెస్తే ఎంపీకి బ్రమ్మరథం పడుతామమన్నారు. ఎంపి అర్వింద్ మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యారన్నారు.