మోడీని కలవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ఎవరు చెప్పారు ?

మోడీని కలవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ఎవరు చెప్పారు ?

తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? నాలుగు రోజుల పాటు దేశ రాజధానిలో ఉన్న సీఎం ప్రధానిని ఎందుకు కలవలేదు? కేసీఆర్ ది పర్సనల్ టూరా? అని ఇలా రకరకాల ప్రశ్నలు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో వీసిక్స్ డిస్కషన్ లో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పలు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మోదీని కలవడానికి కేసీఆర్ వెళ్లారని ఎవరు చెప్పారు? ఎవరికి వాళ్లు చెప్పుకుంటే అయిపోతాదా ? అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రశ్నించారు. ఎవరికి వాళ్లు ఊహించుకోవడం కాదన్నారు. కేంద్ర మంత్రులు చెప్పారా ? లేదంటా రాష్ట్ర మంత్రులు అధికారులు చెప్పారా ? అని ప్రశ్నించారు. అయితే దీనికి డిస్కషన్లో అయతే ఇది కేసీఆర్ పర్సనల్ టూర్? అనుకోవచ్చా అని యాంకర్ అడిగిన ప్రశ్నపై ఎమ్మెల్యే క్రాంతి మండిపడ్డారు. ఆ విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదని సీరియస్ అయ్యారు. ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లిన తర్వాత కేంద్రమంత్రుల్ని కలిసినప్పుడు.. ప్రధాని ఎందుకు కలవలేదంటూ ప్రశ్నించారు. సీఎం నాలుగురోజులు ఉన్నాప్రధాని మోదీకి ఆయనకు కలిసే టైం లేదా ? అంటూ ఎమ్మెల్యే క్రాంతి ప్రశ్నించారు. 

కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే అక్కడ ఆయన నాలుగు రోజులు ఉన్నా ప్రధానితో భేటీ కాలేదు. మరోవైపు సీఎం సతీమణి కూడా ఢిల్లీలోనే ఉండటంతో.. ఆమె కోసమే ముఖ్యమంత్రి హస్తినకు వెళ్లారా ? అని పలువురు రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. అనారోగ్య కారణాలతో ఎయిమ్స్ లో సీఎం సతీమణికి పలు టెస్టులు నిర్వహించారు. సీఎం కూతురు కవిత, కేటీఆర్ కూడా ఈ నాలుగు రోజులు ఢిల్లీలోనే  ఉన్నారు. దీంతో ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ ది అధికారిక పర్యటన కాదని.. పర్సనల్ టూర్ అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.