ఇంటికో ఉద్యోగం ఇస్తామంటే.. అధికారాన్ని అప్పగిస్తాం

ఇంటికో ఉద్యోగం ఇస్తామంటే.. అధికారాన్ని అప్పగిస్తాం

జడ్చర్ల, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, దళితులతో పాటు గిరిజనులు, బీసీ, మైనా ర్టీలందరికీ దళితబంధు తరహాలో ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లెటర్లు ఇస్తే రాష్ట్రంలో ఆరు నెలలపాటు అధికారం అప్పగించడానికి టీఆర్ఎస్​ పార్టీ సిద్ధంగా ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన  ప్రత్యేక కార్యక్రమంలో ఆయన  కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దళితబంధు పథకం అమలుపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దళితబంధు పథకాన్ని సీఎం అమలు చేస్తారన్నారు. అనంతరం మిడ్జిల్​ మండలం రాణిపేటలో బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.