బండి సంజయ్ కి ఎమ్మెల్యే ముత్తి రెడ్డి సవాల్

బండి సంజయ్ కి ఎమ్మెల్యే ముత్తి రెడ్డి సవాల్

కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమీక్షా సమావేశాన్ని బహిశ్కరించారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయకు 5 వేల కోట్లు, మిషన్ భగీరథకు 19 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి అయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది నింజం కాదా అని ప్రశ్నించారు. ఒక వేళ కాదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి.. రాజీనామ పత్రాన్ని జనగామ ఆర్టీసీ చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహం పాదాల వద్ద ఉంచుతానని సవాల్ చేశారు.

రాష్ట్రంలో బండి సంజయ్ పాదయాత్ర విరమించుకొని.. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కోరారు. నిధులు తెస్తే నియోజకవర్గం మొత్తం ప్రజా ప్రతినిధులతో బండి సంజయ్ కి పూలమాల వేస్త అని అన్నారు. తెలంగాణలో దళిత బంధులాగా బీసీ బంధు అమలు చేస్తాం అని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు రద్దు చేయమంటారా అని బీజేపీ నాయకులపై మండిపడ్డారు. కాగా, జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు జనగామ ప్రజల పక్షాన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ధన్యవాదాలు చెప్పారు.