స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి స్టెప్పులేశారు. కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిలతో కలిసి ’బోనగిరి గడ్డమీదా‘.. అనే ఫోక్ సాంగ్ కు డ్యాన్స్ చేశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో మన ఊరు - మనబడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య... విద్యార్థులు డ్యాన్స్ చేస్తుంటే ఉత్సాహం పట్టలేక.. ఆయన కూడా వారితో పాటు హుషారుగా స్టెప్పులేశారు. ఎమ్మెల్యే స్టెప్పులేయడంతో విద్యార్థులు మరింత హుషారుతో కేకలు వేశారు. డ్యాన్స్ చేసిన తర్వాత రాజయ్య విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే స్టెప్పులేయడం ఇది మొదటి సారికాదు.. గతంలో కూడా ఓ వేడుకలో బుల్లెట్ బండెక్కి సాంగ్ కు స్టెప్పులేశారు రాజయ్య.
