
నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు TRS ఎమ్మెల్సీ అభ్యర్ధులు. ఉదయం 11 గంటలకు అమరవీరులకు నివాళులర్పించి నామినేషన్లు వేయనున్నారు. కార్యక్రమాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పర్యవేక్షించనున్నారు. ఒక్కొక్క అభ్యర్ధి నామినేషన్ బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం అభ్యర్ధికి సంబంధించిన నామినేషన్ బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూసుకోనున్నారు. ఎగ్గే మల్లేశం నామినేషన్ బాధ్యతను మంత్రి మల్లారెడ్డి….. శేరి సుభాష్ రెడ్డి నామినేష న్ బాధ్యతను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… సత్యవతి రాథోడ్ నామినేష న్ బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చూస్తారు. కార్యక్రమం మొత్తం మధ్యాహ్నం పన్నెండున్నర లోపు ముగియనుంది. శాసనసభ ప్రొసీడింగ్ కు ఇబ్బంది లేకుండా విడతలు, బృందాలుగా వెళ్లి నామినేషన్ వేసేలా ఏర్పాటు చేశారు.