నిజామాబాద్ వర్షాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా

నిజామాబాద్ వర్షాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా

నిజామాబాద్ లో కురుస్తున్న వర్షాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. ఈ మేరకు ఆమె జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా చొంగ్తు నిజామాబాద్ లో పర్యటించనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను కవిత ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సత్వర చర్యలు ప్రారంభించాలని సూచించారు. నందిపేట్, సిరికొండ, బోధన్ నియోజకవర్గాలకు మంజూరు చేసిన ప్రత్యేక అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలన్నారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆఫీసర్ ను నియమించిందన్నారు ఎమ్మెల్సీకవిత.