పేదల అభివృద్ధి కోసమే సంక్షేమ పథకాలు

పేదల అభివృద్ధి కోసమే సంక్షేమ పథకాలు

దేశంలో ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను ఉచితాలు అనొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయ జనాభాలో ఎక్కువ మంది పేదలు ఉన్నారని..వారి సంక్షేమం కోసమే కేంద్రం అయినా..రాష్ట్ర ప్రభుత్వాలు అయినా పథకాలు అమలు చేస్తున్నారని ఆమె చెప్పారు. బ్యాంకులను లూటీ చేసిన కార్పొరేట్ వ్యక్తుల కోసం కేంద్రం ప్రకటించిన రూ. 10 లక్షల కోట్ల మాఫీని ఉచితాలు అంటారని చెప్పారు. పేదల ఆరోగ్యం, వ్యవసాయం, పిల్లల చదువుల కోసం అమలు చేసేవి సంక్షేమ పథకాలని..  ఇవేవీ ఉచితాలు కాదని తెలిపారు.

దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ఉచితాలు అంటూ పేదలను అవమానించొద్దని సూచించారు.  ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయొద్దని భావిస్తే..వారికి సరైన ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  వారికి ఉపాధి కల్పించలేనప్పుడు..ఖచ్చితంగా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిందేని చెప్పారు. 

ఉచిత పథకాలంటూ పేదలను అవమానించడం ఆపేయాలని కేంద్రం ..రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీని వల్ల పేదలు  సాయం పొందలేరన్నారు.