
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగంపై చర్చ కొత్త విషయమేమీ కాదని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ జరుగుతున్నదేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు. రాజ్యాంగం పనితీరుపై సమీక్షకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి 2000 సంవత్సరంలో న్యాయ నిపుణులతో కమిషన్ వేశారని గుర్తు చేశారు. బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ అవసరాలకు తగ్గట్టుగా రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చని అంబేద్కర్ చెప్పారని.. ఆర్టికల్368 ద్వారా మూడు పద్ధతుల్లో రాజ్యాంగ సవరణలకు అవకాశం ఉందన్నారు.