
టీఆర్ఎస్ మహబూబ్ నగర్ ఎంపీ, లోక్ సభ పక్ష నేత జితేందర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న జితేందర్ రెడ్డి ఇటీవలే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చర్చలు జరిపి బుధవారం పార్టీలో చేరారు.