ఎన్నికల్లేవు..రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు

ఎన్నికల్లేవు..రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు

ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవని.. రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర్ రావు. కేంద్రంతో కలిసి పనిచేస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. రాష్ట్రానికి రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు చాలా రావాలని.. వాటి గురించి కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. రైతులకు కావలసినంత నీరు, ఉచితంగా విద్యను అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రైతులు పండించిన పంటకు మెరుగైన గిట్టుబాటు ధర లభించాలన్నారు.

రిపబ్లిక్ డే రోజున జరిగిన హింస సరికాదన్నారు  మరో ఎంపీ కేకే. ఈ కారణాన్ని చూపి రైతులు సమస్యలు,డిమాండ్లను విస్మరించొద్దన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిస్కరిస్తే రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసను సమర్థించినట్లు అవుతుందన్నారు. కేంద్ర ప్రబుత్వం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తుందన్నారు. అల్ పార్టీ మీటింగ్ కేవలం తంతుగానే మారిందన్నారు కేకే. విభజన హామీలు  అమలుకావడం లేదన్నారు.  రైతు చట్టాలను తాము వ్యతిరేకించామని… అందులో ఎలాంటి మార్పులేదన్నారు.  రైతు చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో  ఆల్ పార్టీ మీటింగ్ లో చెప్పామన్నారు.  కోవిడ్ కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్నారు ఎంపీ నామానాగేశ్వర్ రావు. దీనిపై పార్లమెంట్ లో చర్చ జరగాలన్నారు.