
ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. జులై 21 న అనారోగ్యకారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతిముర్ముకు పంపించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. 2022 ఆగస్టు 11న భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ధన్ ఖడ్ . పదవి కాలం ఇంకా రెండేళ్లు ఉండగానే ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
ALSO READ | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా..
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన (జులై21) తొలి రోజే ధన్కడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలు చెబుతున్నప్పటికీ.. ఏదో బలమైన రాజకీయ కారణాలతోనే ధన్ ఖడ్ రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి పదవి కాలంలో ఉంటానని ఇటీవలే జులై 10న జరిగిన ఓ కార్యక్రమంలో ధన్కడ్ చెప్పారు. ఇపుడు ఆకస్మాత్తుగా పదవికి రాజీనామా చేయడంతో హాట్ టాపిక్ గా మారింది.
రైతు కుటుంబంలో పుట్టి
1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్ సైనిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన జగదీప్ 1979లో రాజస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. . 1990లో రాజస్థాన్ హైకోర్టులో సీనియర అడ్వకేట్ గా నియమితులయ్యారు... సుప్రీంకోర్టులో పలు కేసులు వాదించారు.
జనతాదళ్తో రాజకీయ అరంగేట్రం
1989లో ధన్‌కర్ జనతాదళ్ తరఫున జున్ జునూ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1990-91 మధ్య పార్లమెంట్ వ్యవహరాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.1993 నుంచి 1998 వరకు కిషన్ఘడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 జులై 30నుంచి 2022 జులై 17 వరకు జగదీప్ ధన్కర్ వెస్ట్ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు.