19 మంది ఎంపీల సస్పెండ్ ను ఖండిస్తున్నాం

19 మంది ఎంపీల సస్పెండ్ ను  ఖండిస్తున్నాం

బీజేపీ ప్రభుత్వం 19 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు, బడుగు లింగయ్య యాదవ్, సురేష్ రెడ్డిలు స్పందించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగు లింగ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా 19 మంది ఎంపీలను సస్పెండ్ చేసిందన్నారు. టీఆర్ఎస్ ఎంపీలను ముగ్గురిని సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం ఇష్టాను సారంగా పరిపాలిస్తుందని.. ప్రజాస్వామ్యం ఖూని అయిందని మండిపడ్డారు. దేశ ప్రజలను,  రైతులను, విద్యార్థులను, యువకులను నాశనం పట్టించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు దేశవ్యాప్తంగా జీఎస్టీ ధరల పెంపుపై, అధిక ధరలపై పార్లమెంట్లో చర్చ జరపాలని డిమాండ్ చేశామని తెలపారు.

తెలంగాణలో గత పది రోజుల నుంచి తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి తీరప్రాంతాలకు వెళ్లి ప్రజలకు భరోసా కల్పించారని లింగయ్య యాదవ్ అన్నారు. తెలంగాణకు మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ వస్తోంది. తెలంగాణ మీద కక్ష కట్టి శత్రువులను చూసినట్లు చూస్తోంది. జీఎస్టీ ధరల పెంపుపై ఫాలు, పెరుగు, చక్కెర ,ఉప్పు వాటి పైన పెంచడంపై మేము పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నాము. ఈ అంశాలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ చేశామని ఎంపీ బడుగు లింగ యాదవ్ పేర్కొన్నారు.

ఎంపీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదు రాజకీయ పార్టీల నుంచి 19 మంది ఎంపీలు సస్పెండ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధిక ధరలో జీఎస్టీ పెంపు వల్ల పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. విపక్ష పార్టీలను డిమాండ్ చేసినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి ముఖ్య విషయాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఈ రోజు పార్లమెంటు చరిత్రలో బ్లాక్ డే గా భావిస్తున్నామని విమర్శించారు. రాష్ట్రంలో వరదలు వచ్చి భారీగా నష్టం జరిగింది. నష్టపరిహారంపై పార్లమెంట్ లో చర్చించాలని ఆందోళన చేస్తే సస్పెండ్ చేశారు సురేష్ రెడ్డి తెలిపారు.