
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యల స్టేటస్ రిపోర్టులను ఈ సందర్భంగా ఎంపీలకు అందజేస్తారు. రాష్ట్ర హక్కులను సాధించేందుకు ఉభయ సభల్లో ఎంపీలు అనుసరించాల్సిన పోరాట పంథాపై కేసీఆర్ సూచనలు చేస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.