
రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడితే, ఇప్పుడు బావుల దగ్గర వెూటార్లకు మీటర్లు పెట్టి బీజేపీ ఇబ్బంది పెడుతోందన్నారు మంత్రి హరీష్ రావు. రైతులను ఆదుకోవాల్సిన పార్టీలు ఆటాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీలను దుబ్బాక ఉప ఎన్నికలో గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని ముబారస్‌పూర్‌లో హరీష్ రావు మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గ తొలి మహిళ ఎమ్మెల్యే సోలిపేట సుజాతనేననీ, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు వచ్చిపోతారు.. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేది కేవలం టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు మంత్రి హరీష్.