కొనసాగుతున్న కారు జోరు

కొనసాగుతున్న కారు జోరు

హైదరాబాద్: గ్రేటర్‌లో టీఆర్ఎస్ మరోసారి జోరు చూపించింది. కాకపోతే కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. ఇంతకు ముందు 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఆ స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం ఏ మాత్రం కనిపిండంలేదు. మరోవైపు టీఆర్ఎస్‌ను సవాల్ చేసిన బీజేపీ సీట్లలో వెనుకబడిన చాలా చోట్ల నువ్వా.. నేనా అనే రీతిలో పోటీ ఇచ్చింది. పలు చోట్ల టీఆర్ఎస్‌కు బీజేపీ చెమటలు పట్టించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గణనీయంగా ఓట్లు సంపాదించింది. ఓడిన చోట్ల చాలా తక్కువ ఓట్లతో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

సనత్‌ నగర్‌ డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కొలను లక్మి రెడ్డి దాదాపు 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా  భారతినగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి సుమారు 3900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాతం సుమారు 2025 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ అభ్యుర్థుల గెలుపు కొనసాగుతోంది. రంగారెడ్డి నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి విజయ్‌శేఖర్ గౌడ్‌ విజయం సాధించారు. బాలానగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలపొందింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఆవుల రవీందర్‌రెడ్డి  విజయం సాధించారు. పలు డివిజన్లలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ చైతన్యపురిలో గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి నర్సింహ గుప్తా  విజయం సాధించారు.