టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ లీడర్

V6 Velugu Posted on Jul 25, 2019

టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ లీడర్ సతీష్ కుమార్ రాజీనామా చేశారు. ట్రేడ్ యూనియన్ లీడర్ గా గుర్తింపు పొందిన సతీష్ కుమార్..2004  నుండి TRS పార్టీలో క్రీయాశీలకంగా పని చేశారు. 2014,18 అసెంబ్లీ ఎన్నికల్లో మలక్ పేట నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం మలక్ పెట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి గా పనిచేస్తున్న సతీష్ కుమార్.. నిన్న జరిగిన వాటర్ వర్క్స్ యూనియన్ ఎలక్షన్స్ లో యూనియన్ అధ్యక్షుడిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ నేతలే తనని కావాలని ఓడించారని సతీష్ కుమార్ ఆరోపిస్తున్నారు. అయితే సరైన గుర్తింపు లేని కారణంగా మనస్తాపానికి గురై సతీష్ కుమార్ పార్టీ కి రాజీనామా చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

Tagged senior leader, resigns, TRS party, Malakpet, sathish kumar

Latest Videos

Subscribe Now

More News