
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అని ఉండాల్సిన చోట హైదరాబాద్ రాష్ట్రం అంటూ టీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వేసింది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైన బాజిరెడ్డి గోవర్ధన్.. ఇవాళ (సోమవారం) ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానంగా టీఆర్‌ఎస్ భవన్‌తో పాటు సిటీలోని పలు చోట్ల భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఇలా పెట్టిన వాటిలో ‘‘హైదరాబాద్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇదే ఆహ్వానం భవదీయుడు బాజిరెడ్డి గోవర్ధన్’’ అంటూ రాసి ఉంది. దీనిపై ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ను తప్పుబడుతున్నాయి.