
హైదరాబాద్: ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు పెద్దఎత్తున మహిళా దినోత్సవ సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మార్చి 6,7,8 తేదీల్లో ‘మహిళా బంధు కేసీఆర్’ పేరిట ఈ కార్యక్రమాలను నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నేతలను ఆదేశించింది. మార్చి 6న కేసీఆర్ కు రాఖీ కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డ్వాక్రా సంఘాల లీడర్లకు సన్మానం, థాంక్యూ కేసీఆర్ పేరిట మానవహారం వంటి కార్యక్రమాలుంటాయని టీఆర్ఎస్ తెలిపింది. అలాగే మార్చి 7న కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం, మార్చి 8న ప్రతి నియోజకవర్గంలో మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపాలని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కోరింది.
తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల నేపథ్యంలో.. ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు పెద్దఎత్తున మహిళా దినోత్సవ సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పార్టీ పిలుపు#MahilaBandhuKCR pic.twitter.com/4vg9LVhWXQ
— TRS Party (@trspartyonline) March 3, 2022
ఇవి కూడా చదవండి:
విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు
రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దు