అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్​ను ఓడించాలె

అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్​ను ఓడించాలె

టీజేఎస్​ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం

మునుగోడు/నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పరిష్కరించకుండా నియంత పాలన కొనసాగిస్తున్న కేసీఆర్​పాలనకు రానున్న రోజుల్లో చరమగీతం పాడాలని టీజేఎస్​రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ప్రైవేట్​కాలేజీ, స్కూల్​టీచర్లు ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ ను ఓడించాలని సూచించారు. 9 నెలలుగా కరోనా కారణంగా స్కూల్స్​మూసివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.7 లక్షల మంది ప్రైవేటు టీచర్లు పూట గడవక ఇబ్బంది పడుతున్నారన్నారు. వారికి ఎలాంటి సహాయం అందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రైవేట్​టీచర్ల సమస్యలు సీఎం కేసీఆర్ కు వివరించేందుకు వెళితే అవకాశం ఇవ్వకపోగా ఆందోళన చేపడితే అరెస్టులు చేసి స్టేషన్ లో కూర్చోబెడుతున్నారని అన్నారు. షరతుల సాగుతో రైతులను అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్ పాల్గొన్నారు.

అగ్రి చట్టాలను రద్దు చేయాలె

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై ఈ నెల 8న చేపట్టనున్న భారత్​బంద్​కు టీజేఎస్​ సంపూర్ణ మద్దతు ఉంటుందని కోదండరాం అన్నారు. సోమవారం నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బంద్​లో టీజేఎస్​ కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొనాలని సూచించారు. వెంటనే  3 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ ​చేశారు.