
గద్వాల, వెలుగు: కర్నాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. సోమవారం నారాయణపూర్ డ్యామ్ కు 1.15 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా, 490.77 మీటర్ల లెవెల్ నీటిని నిల్వ ఉంచుకొని, 30 గేట్ల ద్వారా 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల డ్యాం దగ్గర 327.300 మీటర్ల లెవెల్ ను మెయింటెన్ చేస్తూ 12 గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు దగ్గర గేట్ల ద్వారా 79,080 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,038 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్ –1 ద్వారా 315 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 550 క్యూసెక్కులు, రైట్ కెనాల్ ద్వారా 285 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్ ద్వారా150 క్యూసెక్కులతో కలుపుకొని 1,10, 611 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.