అమెరికాలో కాల్పులు ముగ్గురు మృతి.. మరో పది మందికి గాయాలు

అమెరికాలో కాల్పులు ముగ్గురు మృతి.. మరో పది మందికి గాయాలు

ఫిలడెల్ఫియా: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దక్షిణ ఫిలడెల్ఫియా గ్రేస్ ఫెర్రీలోని ఓ వీధిలో సోమవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. 

సమాచారం అందిన వెంటనే అధికారులు స్పాట్​కు చేరుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు పలు రౌండ్ల పాటు కాల్పులు జరిపారని తెలిపారు. అతడి  వద్ద ఉన్న ఓ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాల్పులు పిరికితనంతో జరిపిన చర్య అని పేర్కొన్నారు. 

కాల్పులు చోటు చేసుకోవడానికి గల కారణమేంటో తెలియదని వివరించారు. కాగా, ఇటీవల దక్షిణ ఫిలడెల్ఫియాలోని నైట్‌‌క్లబ్ సమీపంలో కాల్పులు చోటు చేసుకోగా ఎనిమిది మంది చనిపోయారు.