
మల్కాజిగిరి: టీఆర్ఎస్ మహిళా నాయకురాలు తన భర్తతో కలిసి ఓ ఇంటర్నెట్ టెక్నీషియన్ పై దాడి చేసిన ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మల్కాజిగిరిలోని వసంత్ పురి కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. వసంత్ పురి కాలనీలో నివసించే టీఆర్ఎస్ మహిళా నాయకురాలు డీనా తన ఇంట్లో ఇంటర్నెట్ రావడంలేదని టెక్నీషియన్ ని కాల్ చేసి పిలిపించింది . కేబుల్ కట్ కావడంతో టెక్నిషియన్ నరసింహ కేబుల్ జాయింట్ చేసి తన పని పూర్తి చేశాడు. ఆ తరువాత ఇతర కేబుల్స్ కూడా మరమ్మతులు చేయాలని టి.ఆర్.ఎస్ నాయకురాలి భర్త నరసింహాని అడగ్గా.. నరసింహ అందుకు నిరాకరించాడు. దీంతో సహనం కోల్పోయిన టి.ఆర్.ఎస్ నాయకురాలు డీనా, తన భర్త , కూతురుతో కలిసి నరసింహని చితకబాదారు . గాయాలపాలైన నరసింహ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . గతంలో కూడా నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టి.ఆర్.ఎస్ నాయకురాలి భర్తపై హత్యాయత్నం కేసు నమోదు కాగా ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు.