
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించిన హైదరాబాద్ ఓటరు మహావయులందరికీ హృదయపూర్వక దన్యావాదాలు అన్నారు మంత్రి కేటీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదన్నారు. ప్రస్తుతం వచ్చిన స్థానాలకు అదనంగా మరో 20 నుంచి 25 స్థానాలు వస్తాయని ఆశించామని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని చెప్పాయన్నారు.
10 -15 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందామని తెలిపారు. బీఎన్ రెడ్డి కాలనీలో 18 ఓట్ల తేడాతో, మౌలాలిలో 200, అడిక్ మెట్ లో 200, మల్కాజ్ గిరిలో 70 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు ఆశీర్వదించారని ఫలితాలపై సమీక్ష నిర్వహించుకుంటామన్నారు మంత్రి కేటీఆర్.