కాసేపట్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

 కాసేపట్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్: టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో ఉదయం 11.30 గంటలకు సమావేశం మొదలుకానుండడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు తదితరులు హాజరవుతున్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనటం లేదని ఆరోపిస్తున్న టీఆర్ఎస్.. ఈ విషయంపై కేంద్రంపై పోరుకు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. పార్లమెంట్ లో ఎంపీల ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీని కలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

 

ఇవి కూడా చదవండి

వయసు మీద పడిందని కలలు కనడం మానొద్దు

ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలె