
మొబైల్ ఫోన్లు,టీవీలు, కంప్యూటర్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్రక్కులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ రోడ్డు పాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఎవరికి అందిన వాటిని వారు తీసుకెళ్లారు. ఈ ఘటన మహరాష్ట్రలో జరిగింది.
ఉస్మానాబాద్‌లో షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై ఎలక్ట్రానిక్ వస్తువులో వెళ్తున్న ట్రాక్‌కు బోల్తా కొట్టింది. దీంతో ట్రక్కు నుంచి సుమారు రూ.70 లక్షల విలువచేసే వస్తువులను స్థానిక ప్రజలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఎత్తుకెళ్లిన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోతీచంద్ రాథోడ్ తెలిపారు. పోలీసుల విజ్ఞప్తితో కొందరు తీసుకెళ్లిన వస్తువులను తిరిగి అప్పగించారు. ఇప్పటి వరకు 40 శాతం వరకు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.