అల్లు అర్జున్ పై సమంత ప్రశంసలు

అల్లు అర్జున్ పై సమంత ప్రశంసలు

అల్లుఅర్జున్ పుష్ప రిలీజైన్ రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. నాలుగు రోజులకే 173 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూవీలో బన్నీ నటనకు కూడా ప్రశంసలు వస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఎర్రచందనం స్మగ్లర్ గా బన్నీ యాక్టింగ్ సూపర్ అంటూ పొగిడేస్తున్నారు.  లేటెస్ట్ గా సమంత అల్లు అర్జున్ ను తన ఇన్ స్టాగ్రమ్ లో ఆకాశానికెత్తేశారు. మూవీలో అల్లు అర్జున్ అదరగొట్టేశాడని.. యాక్టింగ్ ను చూసి తానెంతో స్ఫూర్తిపొందానని చెప్పారు. ఒక నటుడు గొప్ప నటన కనబరిస్తే వారి  నుంచి తానెప్పుడూ ప్రేరణ పొందుతానన్నారు. పుష్ఫలో అల్లు అర్జున్ అలానే నటించారన్నారు. ఒక భుజం పైకి పెట్టి..ప్రతి సెకను అద్భుతమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు. సమంత పోస్ట్ కు‘డియర్ సమంత మీ ప్రశంసలకు ధన్యవాదాలు..మీ మాటలు నా హృదయాన్ని తాకయని’ బన్నీ రిప్లై ఇచ్చారు. పుష్పలో సమంత‘ ఊ అంటావా మావా’ అనే స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

మరిన్ని వార్తల కోసం

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ను ప్రశ్నించిన ఈడీ

రాజ్యసభలో సహనం కోల్పోయిన జయాబచ్చన్