తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ.. 18 గంట‌ల్లోనే ఉచిత ద‌ర్శ‌నం

తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ.. 18 గంట‌ల్లోనే ఉచిత ద‌ర్శ‌నం

తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది.  స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.   టికెట్ లేని సర్వదర్శనానికి  18  గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి, నడకదారి దివ్యదర్శనానికి 04 గంటల సమయం పడుతోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 

కాగా 2023 జూలై 08 మంగళవారం రోజున  73 వేల 879 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26 వేల144 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

మరోవైపు తిరుమల వెళ్లే భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్  చెప్పింది. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి తిరుమలకు చేరుకునే వారికి అందించే దర్శన టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా మొన్నటి వరకు రోజూ ఆర్టీసీ ప్రయాణికులకు 600 టికెట్లు ఇస్తున్నారు..అయితే  ఇప్పుడు ఆ సంఖ్యను 1000కు పెంచింది. బస్సు ఛార్జీకి తోడు శ్రీవారి దర్శనానికి రూ.300 దర్శన టికెట్‌ను ప్రయాణికులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.