హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు మరో ఏడాది పొడిగింపు

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు మరో ఏడాది పొడిగింపు
  • ట్రంప్ సర్కారు గెజిట్.. విదేశీ నిపుణులపై కొనసాగనున్న ఆంక్షలు
  •     భారతీయ ఇంజినీర్లు, ఐటీ నిపుణులకు గట్టి ఎదురుదెబ్బ

వాషింగ్టన్: అమెరికాకు ఉద్యోగాల కోసం వచ్చే విదేశీ నిపుణులపై ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కారు కఠిన వైఖరిని కొనసాగిస్తున్నది. తీవ్ర దుమారం రేపిన హెచ్-1బీ వీసా లక్ష డాలర్ల (సుమారు రూ. 85 లక్షలు) ప్రత్యేక రుసుము నిబంధనను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ సంస్థల వల్ల స్థానిక అమెరికన్ల ఉపాధి దెబ్బతింటోందన్న కారణంతో గతంలో తెచ్చిన ఈ నిబంధన గడువును పెంచుతున్నట్టు ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో ఈ పెనుభారం 2027 సెప్టెంబర్ 21 వరకు కొనసాగనున్నది.

ఫీజుల భారం 10 వేల శాతం పెంపు

గతంలో హెచ్-1బీ దరఖాస్తుకు కంపెనీలు కేవలం 995 డాలర్లు మాత్రమే చెల్లించాల్సి ఉండేది. కొత్త నిబంధనతో ఈ మొత్తం ఏకంగా పదివేల శాతం పెరిగి లక్ష డాలర్లకు చేరింది. అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులను దేశంలోకి తీసుకురావాలంటే కంపెనీలు ఈ భారీ మొత్తాన్ని సమర్పించాల్సిందే. ఆ నిబంధన తీసుకువచ్చి ఏడాది సమయం పూర్తవుతున్న సమయంలో ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 
12 నెలల పాటు ఈ పెంపును పొడిగించింది.

భారతీయులపైనే అత్యధిక ప్రభావం

హెచ్-1బీ లబ్ధిదారుల్లో దాదాపు 70 శాతం వాటా భారతీయ నిపుణులదే కావడంతో ఈ నిర్ణయం మన ఐటీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయనున్నది. రెండో స్థానంలో ఉన్న చైనా వాటా కేవలం 12.1 శాతం మాత్రమే. ఇంత భారీ మొత్తం చెల్లించి విదేశాల నుంచి ఉద్యోగులను రప్పించడానికి కంపెనీలు వెనుకాడుతుండటంతో.. కన్సల్టెన్సీల ద్వారా అమెరికా వెళ్లాలనుకునే ఫ్రెషర్లు, జూనియర్ డెవలపర్ల అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లేనని ఐటీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో అత్యంత అరుదైన సాంకేతిక నిపుణులకే కంపెనీల స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ పరిమితం కానుంది.

ఎవరికి ఊరట? ఎవరిపై పిడుగు?

  • అమెరికాలోని యూనివర్సిటీల్లో విద్యార్థి వీసాలపై (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1) చదువు పూర్తి చేసుకొని, అక్కడే ఉండి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1బీకి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ లక్ష డాలర్ల ఫీజు నిబంధన వర్తించదు.
  •     అమెరికా గడ్డపైనే ఉంటూ.. ఇతర వీసాల నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1బీకి స్టేటస్ మార్చుకునే వారిపైనా ఈ భారం ఉండదు.
  •     భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి విదేశాల్లో ఉంటూ, అమెరికా వెళ్లడానికి కొత్తగా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1బీ పిటిషన్లు దాఖలు చేసే ఉద్యోగులకు ఈ రూ.85 లక్షల రుసుము తప్పనిసరి.