V6 News

ట్రంప్‌‌‌‌‌‌‌‌తో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన మోదీ ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

ట్రంప్‌‌‌‌‌‌‌‌తో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన మోదీ ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌ తో ప్రధాని మోదీ గురువారం ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించినట్లు, జాతీయ , అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. "యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడాను. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించాం. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను చర్చించాం. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటాయి. అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారం బలోపేతం కావడం పట్ల సంతృప్తిగా ఉన్నాం" అని మోదీ ట్వీట్ చేశారు.