భారత్‌‌లో అమెరికా రాయబారిగా.. ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్

భారత్‌‌లో అమెరికా రాయబారిగా.. ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్
  • తన సన్నిహితుడిని నియమించుకున్న ట్రంప్​

వాషింగ్టన్‌‌: భారత్‌‌లో అమెరికా కొత్త రాయబారిగా యూఎస్​ ప్రెసిడెంట్ డొనాల్డ్​ట్రంప్ తన సన్నిహితుడైన సెర్గియో గోర్‌‌ను నియమించారు. గోర్‌‌ను దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగా కూడా ప్రకటించారు. 

తన ట్రూత్‌‌ సోషల్‌‌ ద్వారా ట్రంప్‌‌ ఈ విషయం వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ఈ ప్రాంతంలో తన ఎజెండాను అమలు చేయడానికి, అమెరికాను గొప్పగా మార్చడానికి నమ్మకమైన వ్యక్తి అవసరమని.. అందుకే గోర్​ను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. 

సెర్గియో గోర్‌‌ ప్రస్తుతం వైట్‌‌హౌస్‌‌లో పర్సనల్‌‌ డైరెక్టర్‌‌గా ఉన్నారు. ట్రంప్‌‌ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రభుత్వ ఉన్నత స్థానాలకు నియామకాల పరిశీలనలో భాగమవుతున్నారు.