మొదటిరోజే మిలియన్ కాపీలు అమ్ముడైన ట్రంప్ పుస్తకం

మొదటిరోజే మిలియన్ కాపీలు అమ్ముడైన ట్రంప్ పుస్తకం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి ఆయన అన్న కూతురు రాసిన పుస్తకం మొదటిరోజే దాదాపు మిలియన్ కాపీలు అమ్ముడైంది. ఈ విషయాన్ని స్వయంగా పుస్తక ప్రచురణకర్త తెలిపారు. ‘టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్’ పేరుతో ట్రంప్ మేనకోడలు మేరీ ట్రంప్ ఈ పుస్తకాన్ని రాశారు. దీనికి ‘హౌ మై ఫ్యామిలీ క్రియేట్ ది వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ మ్యాన్’ అనే ట్యాగ్ ను పెట్టింది.

ట్రంప్ యొక్క అన్నయ్య అయిన ఫ్రెడ్ కూతురే మేరీ ట్రంప్. ఆమె ఓ సైకాలజిస్ట్. ఆమె ట్రంప్ ని గర్వంతో ఉన్న అజ్ఞాని అని ఆరోపించారు. అంతేకాకుండా.. ట్రంప్ ఓ నార్సిసిస్ట్ అని వ్యాఖ్యానించింది.

మంగళవారం విడుదలైన ఈ పుస్తకం ప్రీ-ఆర్డర్‌లతో పాటు ఆడియో మరియు డిజిటల్ వెర్షన్‌లతో సహా 9,50,000 కాపీలు అమ్ముడైనట్లు పబ్లిషింగ్ కంపెనీ సైమన్ & షస్టర్ తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో ఒక పుస్తకం అమ్ముడుకావడం కంపెనీ చరిత్రలో రికార్డ్ అని పబ్లిషింగ్ కంపెనీ వర్గాలు తెలిపాయి.

కాగా.. వైట్ హౌస్ వర్గాలు ఈ పుస్తకాన్ని ఒక అబద్ధాల పుస్తకంగా వర్ణించారు. ట్రంప్ సోదరుడు రాబర్ట్ ట్రంప్ ఈ పుస్తక ప్రచురణను ఆపివేయాలని కోర్టుకు వెళ్లారు. మేరీ బహిర్గతం కాని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని వారు వాదించారు.

సైమన్ & షుస్టర్ మరిన్ని కాపీల కోసం ఆర్డర్ పొందింది. దాంతో ఈ పుస్తకం అమెరికన్ మార్కెట్‌లో 1.15 మిలియన్లకు చేరింది. అంతేకాకుండా.. కెనడా మరియు ఆస్ట్రేలియాలో అమెజాన్ సేల్స్ లో ఈ పుస్తకం అగ్రస్థానంలో ఉంది.

For More News..

నాన్ టీచింగ్ స్టాఫ్ ను తీసేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు

అడ్డుకోబోమని ఇప్పుడు చెప్పండి.. ఏడాదిలో కొత్త బిల్డింగ్