చర్చిలు తెరవడం అత్యవసరం: ట్రంప్

చర్చిలు తెరవడం అత్యవసరం: ట్రంప్

వాషింగ్టన్: అమెరికాలో చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలను వెంటనే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. ‘‘ఈ వారాంతంలో, ఇప్పుడే ఆయా రాష్ట్రాలలో చర్చిలను తెరవడానికి గవర్నర్లు అనుమతించాలి’’ అని ట్రంప్ అన్నారు. ప్రార్థనా స్థలాలు చాలా ముఖ్యమైనవి, వాటిని తెరవడం ప్రస్తుతం అత్యవసరం అని శుక్రవారం వైట్​హౌస్ వద్ద ప్రెస్ మీట్​లో అన్నారు. కరోనా హాట్​స్పాట్​లుగా కొన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ.. ఈ వారాంతంలో చర్చిలను తిరిగి తెరవనివ్వాలంటూ దేశవ్యాప్తంగా గవర్నర్లకు పిలుపునిచ్చారు.

ట్రంప్ ప్రకటన తర్వాత సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిపార్ట్ మెంట్… సోషల్ డిస్టెన్సింగ్ మెయింటెనెన్స్ పై కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. విశాలమైన ప్రదేశాల్లో మాత్రమే ప్రార్థనలు నిర్వహించాలని చెప్పింది. చర్చిల్లోకి, ఇతర ప్రార్థనా స్థలాల్లోకి ప్రజల్ని లిమిటెడ్​గా అనుమతించాలని, ఎంట్రీకి ఒక సారి పది మంది కంటే ఎక్కువగా పర్మిట్ చేయవద్దని సూచించింది. ఒకరికొకరు రెండు మీటర్ల దూరం పాటించాలంది. అమెరికాలో ఇప్పటివరకు 16 లక్షల 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 96,370 మంది మృత్యువాత పడ్డారు. 3,17,000 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.