ఇండియాతో వాణిజ్య చర్చలుండవు: టారిఫ్ వివాదం పరిష్కారం కాలేదు: ట్రంప్

ఇండియాతో వాణిజ్య చర్చలుండవు: టారిఫ్ వివాదం పరిష్కారం కాలేదు: ట్రంప్

వాషింగ్టన్: ఇండియాపై 50% టారిఫ్ విధించామని, అందులో 25% టారిఫ్ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మిగిలిన 25%టారిఫ్ ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నదని తెలిపారు. అయితే, ఇప్పటి దాకా సుంకాల విషయంలో ఎలాంటి చర్చలు ఆ దేశంతో చేయలేదని చెప్పారు. 

టారిఫ్ వివాదం పరిష్కారం అయ్యేవరకు ఇండియాతో ఎలాంటి వాణిజ్యపరమైన చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. ట్రంప్‌‌‌‌ విధించిన సుంకాల భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని ఇండియా చూస్తుంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం సిద్ధంగా లేనట్లు స్పష్టమవుతున్నది.