
వాషింగ్టన్: భారత్‌పై 24 గంటల్లో మరిన్ని అదనపు సుంకాలు విధిస్తానన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. భారత్‌పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించాడు. తొలుత 2025, జూలై 30న ఇండియాపై 25 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్.. 2025, ఆగస్ట్ 6న మరో 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తాజా సుంకాలతో భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌లు విధించాడు ట్రంప్. భారతపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తూ బుధవారం (ఆగస్ట్ 6) కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు ట్రంప్. దీంతో ఇప్పటి నుంచి అమెరికాలో భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు అమలు కానున్నాయి. అమెరికా హెచ్చరించినప్పటికీ రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుండటంతోనే ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించారని వైట్ హౌజ్ ధృవీకరించింది.
కాగా, ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఆయిల్, వెపన్స్ కొనుగోలు చేస్తే భారీ సుంకాలు విధిస్తామని ప్రపంచ దేశాలను హెచ్చరించారు ట్రంప్. వార్ టైమ్‌లో రష్యాతో వ్యాపారం చేయడమంటే.. యుద్ధంలో పరోక్షంగా రష్యాకు మద్దతు ఇవ్వడమేనని అన్నారు. ట్రంప్ బెదిరింపులను పట్టించుకోని భారత్.. రష్యా నుంచి అలాగే చమురు దిగుమతి చేసుకుంటోంది. తమ మాట వినని ఇండియాపై కోపం పెంచుకున్న ట్రంప్.. 2025, జూలై 30న భారత ఎగుమతులపై 25 శాతం వాణిజ్య సుంకాలు విధించాడు. ఇలాగైనా ఇండియా దారికి వస్తుందని ట్రంప్ భావించాడు.
ట్రంప్ 25 శాతం టారిఫ్స్ విధించినప్పటికీ.. దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి యధావిధిగా చమురు దిగుమతి చేసుకుంది భారత్. ఈ చర్యతో మరింత ఆగ్రహానికి గురైన ట్రంప్.. ఇప్పటికే విధించిన 25 శాతం కాకుండా భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని 2025, ఆగస్ట్ 5న హెచ్చరించాడు. ట్రంప్ విధించిన 24 గంటల డెడ్ లైన్ పూర్తి కావస్తున్నప్పటికీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే విషయంలో భారత్ వెనక్కి తగ్గేలా కనిపించకపోవడంతో అన్నట్లుగానే భారత్‌పై మరో 25 శాతం సుంకాలు విధించాడు ట్రంప్. దీంతో భారత ఎగుమతులపై ట్రంప్ మొత్తం 50 శాతం సుంకాలు విధించారు.