
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 'శాంతి అధ్యక్షుడు'అని ఆ దేశ ఫారిన్ అఫైర్స్ కమిటీ అభివర్ణించింది. ట్రంప్ జరిపిన చర్చల వల్లే భారత్, పాకిస్తాన్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఎక్స్ వేదికగా ప్రశంసించింది. “యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వంతో జరిపిన చర్చలతో భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. తెలివైన నిర్ణయం తీసుకున్న రెండు దేశాలకు అభినందనలు” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో శనివారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.