ఇంత‌కీ ట్రంప్ గుడ్ల గూబ‌నా లేక మూర్ఖుడా

ఇంత‌కీ ట్రంప్ గుడ్ల గూబ‌నా లేక మూర్ఖుడా

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మ‌రోసారి అధికారంలోకి తెచ్చేందుకు ఆయ‌న వ‌ర్గం విసృత ప్ర‌చారం చేస్తోంది. కానీ ఆ ప్ర‌చార‌మే ఆయ‌న అప్ర‌తిష్ట‌పాలు చేస్తోంది.

ప్ర‌చారంలో భాగంగా అమెరికన్ కన్జర్వేటివ్ మాజీ టెలివిజన్ హోస్ట్, టోమి లాహ్రెన్ ను రంగంలోకి దించారు. ట్రంప్ కు మ‌ద్ద‌తిచ్చినందుకు భారతీయులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్రంప్ ను ఉల్లు (గుడ్ల‌గూబ) తో పోల్చుతూ ప్రసంగించింది.

ట్రంప్‌ను మ‌రోమారు అధ్య‌క్షుడిగా ఎన్నుకుంటే అమెరికా మ‌ళ్లీ ప్ర‌గ‌తిప‌థంలోకి వెళ్తుంది. ఇప్ప‌టిదాకా మ‌ద్ద‌తుగా నిలిచినందుకు ధ‌న్య‌వాదాలు. గుడ్ల‌గూబ లాగే తెలివైన వారంటూ ఓ వీడియోను విడుద‌ల చేశారు.

ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. హిందీలో ఉల్లు అంటే మూర్ఖుడు అని అర్థం. ట్రంప్ ను గుడ్ల‌గూబ‌తో పోల్చ‌డంపై నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. భాష తెలియ‌క భార‌తీయుల్ని ఆక‌ట్టుకునేందుకు ట్రంప్ ప‌రువు తీస్తున్నారంటూ టోమిపై జోకులు పేలుస్తున్నారు.