ఆయన భార్య అందంగా ఉంది.. అందుకే ఆయనకు ఈ పదవి ఇచ్చా: ట్రంప్

ఆయన భార్య అందంగా ఉంది.. అందుకే ఆయనకు ఈ పదవి ఇచ్చా: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్ను నియమించిన సందర్భంలో బర్గమ్ భార్య గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.

డగ్ బర్గమ్ భార్య కేథరిన్ చాలా అందంగా ఉంటుందని.. భార్యాభర్త ఇద్దరూ కలిసి గుర్రాలను స్వారీ చేసిన వీడియో తనను ఎంతో ఆకర్షించిందని.. ఆ వీడియోలో కేథరిన్ చాలా బాగుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేథరిన్ అందం తనను ఆకర్షించడం వల్లే ఆమె భర్త డగ్ బర్గమ్ను తాను అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా నియమించానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

డ్రగ్ అడిక్షన్పై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేసిన సందర్భంలో.. ఆ ఆర్డర్పై సంతకం చేస్తూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఫెమినిస్టులు ట్రంప్పై మండిపడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ట్రంప్కు ఒక అలవాటుగా మారిందని సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమైంది.

ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో డగ్ బర్గమ్, అతని భార్య కేథరిన్.. ట్రంప్ వెనుకే ఉన్నారు. కేథరిన్ కూడా డ్రగ్ అడిక్షన్ సమస్య నుంచి బయటపడిన బాధితురాలు కావడంతో ఓవల్ ఆఫీస్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె కూడా పాలుపంచుకున్నారు.