వైట్ హౌస్ ను వదిలి వెళ్లనున్న ట్రంప్‌

వైట్ హౌస్ ను వదిలి వెళ్లనున్న ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమిని అంగీకరించనంటూ న్యాయపోరాటానికి సిద్ధపడి కోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీం కోర్టులో కూడా ట్రంప్‌కు ఎదురు దెబ్బతగిలింది. అక్రమంగా ఎన్నికలు జరిగాయని ఆయన చేసిన ఆరోపణలపై కోర్టులు కూడా… అక్రమంగా ఎన్నికలు జరిగినట్లు ఎటువంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పాయి. దీంతో ట్రంప్‌కు తప్పనిసరిగా ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే గతంలో ఒకానొక సందర్భంలో ట్రంప్‌ ఎలక్టోరల్‌ కాలేజీ బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తాను వైట్ హౌస్ ను వీడతానని అన్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఎలక్టోరల్‌ కాలేజీలు కూడా అధ్యక్షుడిగా బైడెన్‌ను, ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌ను ఎన్నుకున్నాయి. రాజ్యాంగ నియమాల ప్రకారం ఎలక్టోరల్‌ కాలేజీలు సోమవారం సమావేశమై… బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో… ఆయన అధికారికంగానూ అధ్యక్షుడిగా ఖరారైనట్లయింది. మొత్తం 538 ఎలక్టోరల్‌ కాలేజీ స్థానాలకు గానూ బైడెన్‌ 302 కైవసం చేసుకున్నారు. దీంతో ట్రంప్‌ వైట్ హౌస్ నుంచి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.