ఇండియాకు ట్రంప్ రిక్వెస్ట్ : మా వస్తువులపై పెంచిన టాక్స్ ను క్యాన్సిల్ చేయాలి

ఇండియాకు ట్రంప్ రిక్వెస్ట్ : మా వస్తువులపై పెంచిన టాక్స్ ను క్యాన్సిల్ చేయాలి

అమెరికా నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న వస్తువులపై భారత్ పెంచిన  సుంకాన్ని రద్దు చేయాలని కోరారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ కు ఉన్న వాణిజ్య ప్రాధాన్య హోదాను కొద్దిరోజుల క్రితం అమెరికా రద్దు చేసింది. దీంతో.. అమెరికా నుంచి వస్తున్న 25 వస్తువులపై భారత్ టాక్స్ పెంచింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లో స్పందించారు. ఇప్పటికే భారత్ ఎక్కువ టారిఫ్ వసూలు చేస్తోందన్న ట్రంప్.. రీసెంట్ గా మరింత పెంచిందన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని.. వెంటనే రద్దు చేయాలని కోరారు. అలాగే.. జీ20 సమ్మిట్ లో మోడీని కలిసి ఈ విషయం చర్చిస్తానని చెప్పారు ట్రంప్.