వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టులందరికీ బీమా చేయిస్తా : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

 వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టులందరికీ బీమా చేయిస్తా : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టుకు బీమా చేయిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్  హాల్​లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన తనకు జర్నలిస్టుల సమస్యలు తెలుసని, చాలా ఏండ్లుగా అసంపూర్తిగా ఉన్న వనపర్తి, మండల ప్రెస్ క్లబ్ లకు స్థలం కేటాయింపు, భవన నిర్మాణంపై దృష్టి పెడతానని చెప్పారు. 

ఇండ్ల స్థలాల కేటాయింపు, రాజీవ్  యువశక్తి పథకం వర్తింపజేసేందుకు తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. ఎవరి ఆత్మగౌరవం దెబ్బతీయకుండా వ్యవహరిస్తానని చెప్పారు. జర్నలిస్టు ఫ్యామిలీలకు విద్య, వైద్యంలో రాయితీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.