భారత్ పై ధ్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విషం గక్కారు. భారత్ తో దోస్తీ అంటూనే మరో వైపు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
భారత్ డ్రగ్స్ కు ఉత్పత్తి, రవాణాకు కేంద్రంగా ఉందని ఆరోపించారు ట్రంప్ . భారత్ తో పాటు 23 దేశాలు అక్రమంగా డ్రగ్స్ ఉత్పత్తి చేస్తూ అమెరికా ప్రజల ముప్పుగా పరిణమించాయని విమర్శించారు. ఈ జాబితాలో ఇండియాతో పాటు పాకిస్తాన్, ఆఫ్గినిస్తాన్, చైనా ఉన్నాయని తెలిపారు ట్రంప్. సెప్టెంబర్ 15న అమెరికన్ కాంగ్రెస్ కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ రిపోర్టులో ట్రంప్ ఈ ఆరోపణలు చేశారు.
బహామాస్, బెలిజ్, బొలీవియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, హైతీ, హోండురాస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగ్వా, పనామా, పెరూ మరియు వెనిజులా దేశాలు ప్రధానంగా డ్రగ్స్ ను ఉత్పత్తి చేస్తూ అక్రమంగా రవాణా చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్, బొలీవియా, బర్మా, కొలంబియా వెనిజులాలను డ్రగ్స్ నిర్మూలన, అక్రమరవాణాలలో పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు ట్రంప్. అఫ్గాన్ లో డ్రగ్స్ నిషేదించినా ఫలితం లేదన్నారు. డ్రగ్స్ సరఫరా వల్ల తాలిబన్లు కూడా లాభ పడుతున్నారని చెప్పారు.
అక్రమ ఫెంటానిల్ ఉత్పత్తికి ఆజ్యం పోసే దేశంగా చైనా ముందంజలో ఉందని విమర్శించారు ట్రంప్. నైటాజీన్లు, మెథాంఫెటమైన్లతో సహా ఇతర సింథటిక్ మాదకద్రవ్యాల ప్రపంచవ్యాప్త మహమ్మారికి ఆజ్యం పోసే ప్రధాన సరఫరాదారుగా చైనా అని ఆరోపించారు ట్రంప్.
