అత్యున్నత న్యాయస్థానానికి జడ్జీగా ఇండియన్ ను ప్రతిపాదించిన ట్రంప్

అత్యున్నత న్యాయస్థానానికి జడ్జీగా ఇండియన్ ను ప్రతిపాదించిన ట్రంప్

అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఇండో-అమెరికన్ ను డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, క్రిమినల్ డివిజన్లో సీనియర్ లిటిగేషన్ కౌన్సెల్ గా మరియు అప్పీలేట్ సెక్షన్ డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్న విజయ్ శంకర్‌ను.. ట్రంప్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కు అసోసియేట్ జడ్జిగా ప్రతిపాదించారు. ఈ కోర్టు వాషింగ్టన్ డీసీకి అత్యున్నత న్యాయస్థానం. ట్రంప్ ప్రతిపాదనను అమెరికన్ సెనేట్ ధృవీకరించినట్లయితే.. శంకర్ ఈ పదవీని పొందుతాడు.

డ్యూక్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పూర్తి చేసిన శంకర్.. 2012 లో న్యాయ శాఖలో చేరడానికి ముందు సొంతంగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారు. లా స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత శంకర్.. యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆన్ ది సెకండ్ సర్క్యూట్ న్యాయమూర్తి చెస్టర్ స్ట్రాబ్‌ వద్ద న్యాయ గుమస్తాగా పనిచేశారు.

For More News..

కామారెడ్డిలో జంట హత్యలు

ఐటీ ఆన్‌లైన్‌ కోర్సులకు మస్తు డిమాండ్

చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్