భారత్, పాకిస్తాన్ ల మధ్య భయంకరమైన పరిస్థితులు : ట్రంప్

భారత్, పాకిస్తాన్ ల మధ్య భయంకరమైన పరిస్థితులు : ట్రంప్

భారత్, పాకిస్తాన్ ల మధ్య భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండు దేశాల మధ్య ప్రమాదకరమైన పరిస్థితి నెలకొందన్నారు. అనేకమంది చనిపోయారన్నారు. దానిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పాకిస్థాన్ కు ఇస్తున్న 1.3బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం నిలిపేసినట్టు ట్రంప్ చెప్పారు. అమెరికాపై పాకిస్థాన్ అడ్వాంటేజీ తీసుకుంటోందని సీరియస్ ఆరోపించారు. 14న పుల్వామాలో CRPF కాన్వాయ్ పై దాడిని నిరసిస్తూ… న్యూయార్క్ లోని పాకిస్తాన్ కాన్సులేట్ ముందు భారతీయులు ఆందోళనకు దిగారు. పాకిస్తాన్ అభివృద్ధిని ప్రోత్సహించాలని… ఉగ్రవాదాన్ని కాదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పాకిస్థాన్ గ్లోబల్ టెర్రరిస్ట్ అని నినాదాలు చేశారు.