ఇండియాపై ఆంక్షలు విధించండి ..మరిన్ని టారిఫ్ లు వేయండి యూరప్ దేశాలపై ట్రంప్ ఒత్తిడి

ఇండియాపై ఆంక్షలు విధించండి ..మరిన్ని టారిఫ్ లు  వేయండి  యూరప్ దేశాలపై ట్రంప్ ఒత్తిడి

వాషింగ్టన్: రష్యా నుంచి క్రూడాయిల్ కొంటున్న ఇండియాను లక్ష్యంగా చేసుకోవాలని యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తున్నది. అమెరికా ఇప్పటికే ఇండియాపై 50 శాతం టారిఫ్ విధించిందని, తమలాగే యూరప్ దేశాలన్నీ ఇండియాపై పన్నులు విధించాలని కోరినట్లు సమాచారం. 

ఇండియాపై ట్రంప్ చేస్తున్న కుట్రల కథనాలను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. ‘‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే మరిన్ని టారిఫ్​లు విధిస్తామని ఇండియాను యూరప్ దేశాలు బెదిరించాలి. క్రూడాయిల్ కొనుగోళ్లు ఆగేలా చూడాలి. 

ఇండియాపై మరిన్ని ఆంక్షలు విధించాలి. ఇండియా ఇచ్చే డబ్బుతోనే ఉక్రెయిన్​పై రష్యా దాడులు చేస్తున్నది. యుద్ధానికి పరోక్షంగా ఇండియా కారణమవుతున్నది. మేము ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. యూరప్ దేశాలన్నీ ఇండియాపై ఆంక్షలతో పాటు అదనపు టారిఫ్​లు విధించాలి’’ అని ట్రంప్ కోరినట్లు సమాచారం.