విదేశీ విద్యార్థులకు ట్రంప్ మరో బిగ్ షాక్.. హార్వర్డ్​ వర్సిటీలో ఫారెన్​ స్టూడెంట్లకు నో ఎంట్రీ

విదేశీ విద్యార్థులకు ట్రంప్ మరో బిగ్ షాక్.. హార్వర్డ్​ వర్సిటీలో ఫారెన్​ స్టూడెంట్లకు నో ఎంట్రీ
  • అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్​ ఆంక్షలు 

న్యూయార్క్​:  ప్రముఖ హార్వర్డ్​ యూనివర్సిటీలో ఫారెన్​ స్టూడెంట్ల ప్రవేశాలపై అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ నిషేధం విధించారు. ఈ వర్సిటీలో చైనీస్​కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై ఇప్పటికే హోంల్యాండ్​ సెక్యూరిటీ డిపార్ట్​మెంట్​ దర్యాప్తు జరుగుతున్నది. దర్యాప్తు ఆధారంగానే ప్రస్తుతం విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై నిషేధం విధిస్తూ ట్రంప్​ నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీలోని ఫారెన్​ స్టూడెంట్లు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని, వీటిపై నివేదిక అందించాలని ఆదేశించారు. 

హింసాత్మక ఘటనలను అదుపు చేయాల్సి ఉన్నా వర్సిటీ యంత్రాంగం ఆ చర్యలు తీసుకోవడం లేదని, కోరిన నివేదికను కూడా అందజేయలేదని, అందుకే విదేశీ విద్యార్థుల చేరికపై నిషేధం విధిస్తున్నట్లు తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్టహెంట్​ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ప్రకటించారు. వర్సిటీకి సంబంధించిన ‘స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్​ఈవీపీ)’  సర్టిఫికెట్​ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిషేధం ప్రభావం ప్రస్తుతం హార్వర్డ్​ వర్సిటీలో చదువుతున్న 6,800 మంది ఫారెన్​ స్టూడెంట్లపైనా ఉంటుంది