ఏఐ కంపెనీల్లో వాటాలు కొంటం: ట్రంప్‌‌

ఏఐ కంపెనీల్లో  వాటాలు కొంటం: ట్రంప్‌‌

న్యూఢిల్లీ: అమెరికన్ ఏఐ కంపెనీల్లో ప్రభుత్వం వాటాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు.  ప్రజలకు భాగస్వామ్యం లేదా వాటాలు  కల్పించే వినూత్న ఆలోచనను పరిశీలిస్తున్నామని తెలిపారు.    ఈ విషయమై వచ్చే వారమే ఏఐ రంగ ప్రముఖులతో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.   

చైనాతో ఏఐ పోటీని దెబ్బతీసే నిబంధనలను  వ్యతిరేకించారు. అయితే, ఇటీవల ఒక సవరించిన ఉత్తర్వుపై సంతకం చేస్తూ.. ఏఐ మోడళ్లను విడుదల చేసే ముందే ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ పరీక్షలకు స్వచ్ఛందంగా సమర్పించాలని డెవలపర్లను కోరారు. ఇప్పటికే చిప్‌‌మేకర్ ఇంటెల్, క్వాంటం కంపెనీల్లో వాటాలు తీసుకున్న ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు ఏఐ రంగంపై పట్టు కోసం ఈ కొత్త వ్యూహాన్ని పరిశీలిస్తోంది. ఓపెన్ ఏఐ, గూగుల్, మెటాలు దీనిపై ఇంకా స్పందించలేదు.