చైనా పాలనలో హాంకాంగ్ విజయవంతం కాబోదు

చైనా పాలనలో హాంకాంగ్ విజయవంతం కాబోదు

న్యూఢిల్లీ: హాంకాంగ్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే జాతీయ భద్రతా చట్టాన్ని చైనా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా డ్రాగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. హాంకాంగ్ వాసుల స్వేచ్ఛను చైనా హరిస్తోందని ప్రపంచంలోని చాలా దేశాలు గగ్గోలు పెట్టాయి. అయినా చైనా తన అభీష్టం నెరవేర్చుకుంది. దాదాపుగా హాంకాంగ్‌ను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుందనే చెప్పాలి. తాజాగా ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కఠినమైన చైనా పాలనలో గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్ అయిన హాంకాంగ్ నరకంలోకి వెళ్తుందన్నారు. ‘వేలాది మంది మేధావులు నడిపించిన హాంకాంగ్‌ను వారికి వ్యతిరేకంగా చైనా నడిపిస్తే అదెప్పటికీ విజయవంతం కాలేదు. హాంకాంగ్ మార్కెట్స్‌ నరకానికి వెళ్తాయి. బిజినెస్ ఎవ్వరూ చేయబోరు’ అని ఫాక్స్ బిజినెస్‌ న్యూస్‌తో మాట్లాడుతూ ట్రంప్ చెప్పారు.